Vinareyo narulara వినరే యో నరులారా christian song lyrics

 

Song 106:

వినరే యో నరులారా 

-------------------------------------------------------------

పల్లవి: వినరే యో నరులారా - వీనుల కింపు మీర - మనల రక్షింప క్రీస్తు

మనుజావతారుండయ్యె - వినరే - అనుదినమును దే - వుని తనయుని

పద - వనజంబులు మన - మున నిడికొనుచును వి

1.నరరూపు బూని ఘోర - నరకుల రారమ్మని - దురితముఁ  బాపు దొడ్డ

దొరయౌ మరియా వరపుత్రుడు - కర మరు దగు క-ల్వరి

గిరి దరి కరి - గి రయంబును ప్రభు - కరుణను గనరే

2.ఆనందమైన మోక్ష - మందరి కియ్య దీక్ష - బూని తనమేని సిలువ

మ్రాను నణచి మృతి బొందెను - దీన దయా పరుడైన మహాత్ము

డు - జానుగ - యాగము సలిపిన తెరంగిది వి

3.పొందు గొరిన వారి - విందా పరమోపకారి - యెంద రెందరిఁ

బరమా - నందపద మొందఁగఁ జేసెను - అందమునన్ దన - బొంది

సురక్తము - జిందెను - భక్తుల – డెందముగుందగ వి

4.ఇల మాయావాదులు మాని - యితఁడే సద్గురు డని - తలపోసి చూచి

మతి ని - శ్చల భక్తిని గొలిచిన వారికి - నిలజనులకు గలు -ముల నలరెడు

ధని - కుల కందని - సుఖ - ములు మరి యొసగును వి

5.దురితము లణఁప వచ్చి - మరణమై తిరిగి లేచి - నిరత మోక్షానంద

సుందర మందిరమున కరుదుగ జనె - బిర బిర మన మం-దర

మా కరుణా - శరనిధి చరణ మొ - శరణని పోదము వి


Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC