Vandanam bonarthumo prabho వందనం బోనర్తుమో ప్రభో ప్రభో

Song 105:

వందనం బోనర్తుమో ప్రభో ప్రభో

-------------------------------------------------------------

పల్లవి: వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో =

వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబులందు కో ప్రభో ॥వందనం||

1.ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు - గన్న తండ్రి మించి

యెపుడు గాచియు = ఎన్నలేని దీవెన - లిడు నన్న యేసువా - యన్ని రెట్లు

స్తోత్రము లివిగో ॥వందనం॥

2. ప్రాత వత్సరంపు బాప మంతయు బ్రీతిని మన్నించి మమ్ము

గావుము - నూత నాబ్దమునను నీదు - నీతి నొసగు మా-దాత

క్రీస్తు నాధ రక్షకా ॥వందనం॥

3. దేవ మాదు కాలుసేతు లెల్లను - సేవకాళి తనువు దినము లన్నియు

నీ వొసంగు వెండి, పసిడి - జ్ఞాన మంత నీ - సేవకై యంగీకరించుమా ॥వందనం॥

4. కోత కొరకు దాసజనము నంపుము- ఈ తరి మా లోటుపాట్లు

దీర్చుము = పాతకంబు లెల్ల మాపి - భీతి బాపుము - ఖ్యాతి

నొందు నీతి సూర్యుడా ॥వందనం॥

5. మా సభలను పెద్దజేసి పెంచుము - నీ సువార్త జెప్ప శక్తి

నీయుము = మోసపుచ్చు నంధకార - మంత ద్రోయుము -

యేసు కృషన్ గుమ్మరించుము ॥వందనం॥

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC