BIBLE GOSPEL CHURCH SONG 96

 

Song 96

Yesuni korakai yila యేసుని కొరకై యిల జీవించెద

----------------------------------------------------------------

యేసుని కొరకై యిల జీవించెద భాసురముగ నే ననుదినము
దోసములన్నియు బాపెను మోక్ష ని వాసమున ప్రభు జేర్చునుగా ||యేసుని||

1. నాశనకరమగు గుంటలోనుండియు మోసకరంబగు యూబినుండి నాశచే
నిలపై కెత్తెను నన్ను పి శాచి పథంబున దొలగించెన్ ||యేసుని||

2. పలువిధముల పాపంబును జేసితి వలదని ద్రోసితి వాక్యమును కలుషము
బాపెను కరుణను బిలిచెను సిలువలో నన్నాకర్షించెను ||యేసుని||

3. అలయక సొలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గములన్
కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు ||యేసుని||

4. శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిశం వ్యాధులు
లేములు మరణము వచ్చిన నాధుడే నా నిరీక్షణగున్ ||యేసుని||

5. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు గుప్తమై యున్నవి ప్రభునందు అద్భుతముగ
ప్రభు వన్నియునొసగి దిద్దును నా బ్రతుకంటిని ||యేసుని||

6. అర్పించెను దన ప్రాణమునాకై రక్షించెను నా ప్రియ ప్రభువు అర్పింతును
నా యావజ్జీవము రక్షకు డేసుని సేవింప ||యేసుని||

7. ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే
దీర్చునుయిలనా చింతలు అభయముతో స్తుతియింతు ప్రభున్ ||యేసుని||

8. యౌవన జనమా యిదియే సమయము యేసుని చాటను రారండి పావన
నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్ ||యేసుని||

------------------------------------------------------------------------

BIBLE GOSPEL CHURCH

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC