SONG 63

 

Nee Rakthame - Nee Rakthame 

నీ రక్తమే నీ రక్తమే



నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్
నీ రక్తమే నా బలము (2)

1.నీ రక్త ధారలే ఇల
పాపికాశ్రయంబిచ్చును (2)
పరిశుద్ధ తండ్రి పాపిని
కడిగి పవిత్ర పరచుము (2) ||నీ రక్తమే||

2.నశించు వారికి నీ సిలువ
వెర్రితనముగ నున్నది (2)
రక్షింపబడుచున్న పాపికి
దేవుని శక్తియై యున్నది (2) ||నీ రక్తమే||

3.నీ సిల్వలో కార్చినట్టి
విలువైన రక్తముచే (2)
పాప విముక్తి చేసితివి
పరిశుద్ధ దేవ తనయుడా (2) ||నీ రక్తమే||

4.నన్ను వెంబడించు సైతానున్
నన్ను బెదరించు సైతానున్ (2)
దునుమాడేది నీ రక్తమే
దహించేది నీ రక్తమే (2) ||నీ రక్తమే||

5.స్తుతి మహిమ ఘనతయు
యుగయుగంబులకును (2)
స్తుతి పాత్ర నీకే చెల్లును
స్తోత్రార్హుడా నీకే తగును (2) ||నీ రక్తమే||

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC