Song 7
ఇదిగో దేవా :-
_____________________________________________________
పల్లవి : ఇదిగో దేవా నా జీవితం - ఆపాదమస్తకం నీకంకితం (2)
శరణం నీ చరణం - శరణం నీ చరణం (2)
1.పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి (2)
విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి (2)
అయినా నీ ప్రేమతో - నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా - ఈ నా శేష జీవితం
2. నీ పాదముల చెంత చేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసకి - ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
నీ హృదయ భారంబు నొసకి - ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
ఆగిపోక సాగిపోవు
- ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా
- ప్రభువా నన్నుండనిమ్ము
3. విస్తార పంట పొలము నుండి - కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు
మనసు - కలకాలం మరి నాకు నొసగు (2)
క్షేమ క్షామ కాలమైనా
- నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించి ఆత్మలన్
- నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా
Comments
Post a Comment