Song 57
నాకెన్నో మేలులు చేసితివే
_______________________________________________
_______________________________________________
పల్లవి : నాకెన్నో మేలులు చేసితివే
నీకేమి చెల్లింతును – దేవా నీకేమి
అర్పింతును (2)
హల్లెలూయా యేసునాథా – కృతజ్ఞతా
స్తుతులివే (2)
1. కృప చేత నన్ను రక్షించినావే
కృప వెంబడి కృపతో – నను బలపరచితివే
నన్నెంతగానో ప్రేమించినావే
నా పాపమును కడిగి – పరిశద్ధపరచితివే
(2)
2. నాకిక ఆశలు లేవనుకొనగా
నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే
నలుదిశల నన్ను భయమావరింప
నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే
(2)
3. నీ రాజ్యమందు నను చేర్చుకొందువు
రానున్న రారాజువు – నా రాజువు నీవు
నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు
నను కొన్నవాడవు – నా వరుడవు నీవు (2)
Comments
Post a Comment