Song 56
నా ప్రియుడా యేసునాధా
_______________________________________________
_______________________________________________
పల్లవి : నా ప్రియుడా యేసునాధా - నీకే స్తోత్రములు
నీవే నా ప్రాణం - నీవే నా జీవం - నీవే నాసర్వం
నీవే నా ఆశ్రయము అయ్యా....
1. ప్రధాన పాపిని పశుప్రాయుడను - నిన్ను విడచితిరిగినాను
నీకు దూరమయ్యాను - ఐనా ప్రేమించావుపాపాలు క్షమించావు
నా కుమారుడా అన్నావు నీ పరిచర్యచేయమన్నావు
2. ఏ మంచి లేదయ్య నన్ను ప్రేమించావు
ఏమిచ్చి నీ ఋణం తీర్చనయ్యా ఏమిలేని దరిద్రుడను
నిరుపేదను నేను ఏమివ్వలేనయ్య
3. బ్రతుకలేనయ్యా - నీవు లేక క్షణమైన
బ్రతికించుము నీదు కృపతో - బలపరచుము నీసేవలో
నీవే దయాళుడవు - నీవే నా దేవడవుకరుణించవా నా ప్రియుడా
నీ కృప నిత్యముండును గాక
నిన్నే
స్తుతియించెదనయ్యా - నీ పరిచర్య చేసెదనయ్య
Comments
Post a Comment