Song 53
నాకేమి కొదువ
_______________________________________________
_______________________________________________
పల్లవి : నాకేమి కొదువ నాధుఁడుండ నిఁక
శ్రీకరుండగు దేవుడే నా
శ్రేష్ట పాలకుఁడు నా యేక రక్షకుఁడు
గనుక
1. ఎంత శోధన యెండ యున్న నాకు నెంతకు
నోరిగర దెపుదు
శాంత జలములు నా చెంతనే యుండు గనుక
2. తప్పిపోయిన నన్ దారిం బెట్టి నన్ను
తెప్పరిల్లఁజేసి నాకుఁ దీరు
నలసటను నా తప్పు మన్నించున్ కనుక
3. నీతి మార్గమునన్ నిల్పున్ నన్ను
ప్రభువు నీతి లేని నాకుఁ దనను
నీతి దయ చేయున్ స్వ నీతిని ద్రుంచున్
గనుక
4. చావు చీఁకట్ల శక్తియుండు ఆహా లోయలోఁబడి
పోవలసినను
నే వెరవకుందు నా దేవుండే తోడు గనుక
5. మీఁదఁబడునట్టి శోధనలన్ ధరను నా దరికి
రానీక దండము
నన్ను బ్రోచుచును నా కాదరణ యౌను గనుక
6. పలువిధములైన భాగ్యములతో తండ్రి
వెలుపలికి దిగవెడలునట్టి వెల
గల గిన్నె నా కలిమిగాఁ జేయున్ గనుక
7. బ్రదుకంతటన్ గృ పాక్షేమములు నా
వదలకుండగ వచ్చు
నాతో సుదినములు గల్గ నా పదలు సంపదలౌ
గనుక
8. దురితంబు లుండు ధరణి నాకు నిజము నిరవు
కాఁదిక నెప్పటికి
నా పరమ దేవుని మందిరమె నా యిల్లు గనుక
Comments
Post a Comment