Song 48

నావన్ని యంగీకరించుమీ
_________________________________________________

పల్లవినావన్ని యంగీకరించుమీ - దేవా 
    నన్నెప్పుడు నీవు కరుణించుమీ
       నావన్ని కృపచేత - నీవలన నొందిన (2)
               భావంబునను నేను - బహుదైర్యమొందెద      
1. నీకు నా ప్రాణము - నిజముగా నర్పించి (2)
               నీకు మీదు గట్టి - నీ కొరకు నిల్పెద              
2. సత్యంబు నీ ప్రేమ - చక్కగా మది బూని (2)
           నిత్యంబు గరముల - నీ సేవ జేసెద             
3. పెదవులతో నేను - బెంపుగ నీ వార్త (2)
        గదలక ప్రకటింప - గలిగించు దృఢ భక్తి          
4.  నా వెండి కనకంబు - నా తండ్రి గైకొనిమీ (2)
       యావంత యైనను - నాశింప మదిలోన       
5. నీవు నా కొసగిన - నిర్మల బుద్దిచే (2)
               సేవ జేయగ నిమ్ము - స్థిర భక్తితో నీకు            
 6. చిత్తము నీ కృపా - యత్తంబు గావించి (2)
          మత్తిల్లకుండగా - మార్గంబు దెలుపుము      
7. హృదయంబు నీకిత్తు - సదనంబు గావించి (2)
            పదిలంబుగా దాని - బట్టి కాపాడుము         

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC