Song 47
నన్నెంతగానో
ప్రేమించెను
_________________________________________________
పల్లవి : నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు నా పాపము – నా శాపము
తొలగించెను నను కరుణించెను (2)
1. సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2)
పడనీయక దరి చేరనీయక (2)
పడనీయక దరి చేరనీయక (2)
తన కృపలో నిరతంబు నను నిల్పెను (2)
2. సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2)
నేర్పించెను నాకు చూపించెను (2)
వర్ణింపగా లేను ఆ ప్రభువును (2)
నేర్పించెను నాకు చూపించెను (2)
వర్ణింపగా లేను ఆ ప్రభువును (2)
3. కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2)
నా కోసమే యేసు శ్రమ పొందెను (2)
నా కోసమే యేసు శ్రమ పొందెను (2)
నా పాపమంతటిని క్షమియించెను (2)
4. ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు (2)
ఏమిత్తును నేనేమిత్తును (2)
ఏమిత్తును నేనేమిత్తును (2)
నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2)
Comments
Post a Comment