Song 45
నజరేయుడా నా యేసయ్య
_________________________________________________
పల్లవి : నజరేయుడా నా యేసయ్య - ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని - గళమెత్తి నీ కీర్తి
నే చాటెద
1. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)
శూన్యములో ఈ భూమిని - వ్రేలాడదీసిన నా యేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2)
నీకే వందనం నీకే వందనం (2)
2. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
జలములలోబడి నే వెళ్ళినా - నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
జలములలోబడి నే వెళ్ళినా - నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2)
3. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)
సీయోనులో నిను చూడాలని - ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
సీయోనులో నిను చూడాలని - ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2)
Comments
Post a Comment