Song 44
ధన్యము ఎంతో ధన్యము
_________________________________________________
పల్లవి : ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము
ఇహమందున,పరమందున నూరు రెట్లు ఫలముండును
వారె ధన్యులు వారెంతో ధన్యులు (2)
1. ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో
ఎవరి పాపములు – మన్నించబడెనో
2. క్రీస్తు యేసుకు
సమర్పించు - కరములే కరములు
క్రీస్తుయేసు స్వరము విను - వీనులే వీనులు
3. ప్రభు యేసుని సేవచేయు
- పాదములే సుందరములు
ప్రభుని గూర్చి పాటపాడు - పెదవులే పెదవులు
4. ఆత్మలో నిత్యము -
ఎదుగుచున్న వారును
అపవాది తంత్రములు - గుర్తించు వారును
5. శ్రమలయందు నిలచి
- పాడుచున్న వారును
శత్రు భాణములెల్ల - చెదరగొట్టు వారును
Comments
Post a Comment