Song 43
దేవుని స్తుతియించుడి
_________________________________________________
పల్లవి : దేవుని స్తుతియించుడి -
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి….ఆ… ఆ…
1. ఆయన బలమును ప్రసిద్ధి
చేయు - ఆకశవిశాలమందు
ఆ… ఆ… ఆకశవిశాలమందు
- ఎల్లప్పుడు
2. ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి - ఆయన ప్రభావమును
ఆ… ఆ… ఆయన ప్రభావమును
- ఎల్లప్పుడు
3. బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి - స్వరమండలములతో
ఆ… ఆ… స్వరమండలములతో
- ఎల్లప్పుడు
4. సన్న తంతుల సితారతోను – చక్కని స్వరములతో
ఆ… ఆ… చక్కని స్వరములతో – ఎల్లప్పుడు
5. పిల్లనగ్రోవుల చల్లగనూది – ఎల్లప్రజలు జేరి
ఆ… ఆ… ఎల్లప్రజలు జేరి – ఎల్లప్పుడు
6. మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి –
గంభీర తాళముతో
ఆ… ఆ… గంభీర తాళముతో – ఎల్లప్పుడు
7. సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి –
హల్లెలూయా ఆమెన్
హల్లెలూయా ఆమెన్
ఆ… ఆ… హల్లెలూయా ఆమెన్ –
ఎల్లప్పుడు
Comments
Post a Comment