Song 42

దేవ సంస్తుతి
_________________________________________________

పల్లవి : దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని
               పావన నామము నుతించుమా – నా యంతరంగము లో వసించు నో సమస్తమా       
1. జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2)
నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు
 లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే   
2. చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2)
జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద
             జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే              
3.  యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త (2)
యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదు
    భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే  
4. అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)
    నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు
         నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే    
5. పడమటికి తూర్పెన్తా ఎడమో – పాపములను మనకు నంత (2)
ఎడము కలుగజేసియున్నాడు – మన పాపములను
           ఎడముగానే చేసియున్నాడు – ఆ కారణముచే           
6.  కొడుకులపై తండ్రి జాలి – పడు విధముగా భక్తిపరుల (2)
 యెడల జాలి పడును దేవుండు – తన భక్తిపరుల
  యెడల జాలిపడును దేవుండు – ఆ కారణముచే 
7. మనము నిర్మితమయిన రీతి – తనకు దెలిసియున్న సంగతి (2)
మనము మంటి వారమంచును – జ్ఞాపకము చేస
   కొనుచు కరుణ జూపుచుండును – ఆ కారణముచే    
8. పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు (2)
    నిరతమును గృప నిలిచి యుండును – యెహోవ నీతి
               తరములు పిల్లలకు నుండును – ఆ కారణముచే           

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC