Song 41

దేవుని ప్రేమ ఇదిగో
_________________________________________________

పల్లవి : దేవుని ప్రేమ ఇదిగో – జనులార – భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును
1. సర్వలోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెను
సర్వోపకారుడుండే – మన మీద – జాలిపరుడై యుండెను        
2.   మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెను
మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే   
3. యేసు క్రీస్తను పేరున – రక్షకుడు – వెలసి నాడిలలోపల
దోసకారి జనులతో – నెంతో సు – భాషలను బల్కినాడు 
4.    ఒడలు రక్తము గారగ – దెబ్బలు – చెడుగు లందరు గొట్టిరి
వడిముళ్లు తల మీదను – బెట్టిరి – ఓర్చెనో రక్షకుండు  
5.  ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు – చున్న పాప నరులను
మన్నించు మని తండ్రిని – యేసుండు – సన్నుతితో వేడెను 
6.  రక్షకుడు శ్రమ బొందగా – దేశంబు – తక్షణము చీకటయ్యెన్
రక్షకుడు మృతి నొందగ – తెర చినిగి – రాతి కొండలు పగిలెను 
7. మూడవ దినమందున – యేసుండు – మృతి గెల్చి లేచినాడు
   నాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున్           

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC