Song 39
దేవునికి స్తోత్రము
_________________________________________________
మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది
1. యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
ఇశ్రయేలీయులను పోగుచేయువాడని
2. గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని
3. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును
వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని
4. ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని
5. దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి
6. ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును
భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని
7. పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను
అరచు
పిల్లకాకులకును ఆహారము తానీయును
8. గుర్రముల నరులందలి బలము నానందించడు
కృప వేడు వారిలో సంతసించువాడని
9. యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని
Comments
Post a Comment