Song 35
దారి తప్పిపోతున్నావా
_________________________________________________
పల్లవి : దారి తప్పిపోతున్నావా విశ్వాసి
తీరమేదో గమనించావా విశ్వాసి (2)
1. ఈ లోకం ముళ్ళ బాట విశ్రాంతి లేని చోట (2)
యేసయ్యే జీవపు బాట సాగిపో ఆయన వెంట (2)
యేసుతో నీవుంటావా విశ్వాసి -
లోకం విడిచి
రానంటావా విశ్వాసి (2)
2. ఓడలోని నల్ల కాకి చూడ నేర్చే ఈ లోకాన్ని (2)
చూడ చూడ లోకపు రుచి ఓడ మరచిపోయే కాకి (2)
కాకిలా నీవుంటావా విశ్వాసి -
పావురంలా
తిరిగొస్తావా విశ్వాసి (2)
Comments
Post a Comment