Song 34

తూర్పు దిక్కు
_________________________________________________

పల్లవి : తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మాఓ మరియమ్మా (2)
          చుక్కను జూచి మేము వచ్చినాము - మొక్కి పోవుటకు (2) 
1. యెరుషలేము పురము జేరవచ్చినాము - హేరోదు నొద్దకు
ఎక్కడ బాలుడని అడిగినాము - మనవి జేసినాము
2. పండిత శాస్త్రులనెల్ల బిలిచినారు -వారు వచ్చినారు
పుర్వ వేదంబులను తెరచినారు - వారు చదవినారు 
3. బెత్లెహేము పురము లోని బాలుడమ్మా - గొప్ప బాలుడమ్మా 
మన పాపముల బాప పుట్టెనమ్మా - మహిమవంతుడమ్మా         
4. పశువుల పాకలోని బాలుడమ్మా - పాపరహితుడమ్మా 
     పాపంబు బాపను పుట్టెనమ్మా - సత్యవంతుడమ్మా           
 5. బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము - బాల యేసు నొద్దకు 
     బంగారు పాదముల మ్రొక్కెదము - బహుగ పాడెదము           

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC