Song 30

       చింత లేదిక
_________________________________________________

పల్లవి : చింత లేదిక యేసు పుట్టెను - వింతగను బెత్లేహమందున
  చెంత జేరను రండి సర్వ జనాంగమా - సంతస మొందుమా (2)
1. దూత తెల్పెను గొల్లలకు - శుభవార్త నా దివసంబు వింతగా
   ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి - స్తుతు లొనరించిరి    
2. చుక్కగనుగొని జ్ఞానులేంతో - మక్కువతో నా ప్రభుని - కనుగొన
    చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి కానుక లిచ్చిరి            
3. కన్య గర్భమునందు పుట్టెను - కరుణగల రక్షకుడు క్రీస్తుడు
    ధన్యులగుటకు రండి వేగమే దీనులై - సర్వ మాన్యులై               
4. పాపమెల్లను పరిహరింపను - పరమ రక్షకుడవతరించెను
       దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము - మోక్ష భాగ్యము              

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC