Song 24

క్రొత్త యేడు మొదలుబెట్టెను
_________________________________________________


  పల్లవి : క్రొత్త యేడు మొదలుబెట్టెను - మన బ్రతుకు నందు(2)
          క్రొత్త మనసు - తోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవ
          తత్తర పడకుండ జేయు - టుత్తమొత్తమంబు జూడ   
1. పొందియున్న మేలులన్నియు - బొంకంబుమీఱ - డెందమందు  
స్మరణజేయుచు యిందు మీరు మొదలుబెట్టు – పందెమందు
బారవలయు నందముగను రవిని బోలి - 
నలయకుండ సొలయకుండ  
2. మేలు చేయదడవొనర్చగా - మీరెఱగునట్లు కాలమంత నిరుడు  
గడచెగా - ప్రాలుమాలి యుండకుండ - జాలమేల సేయవలయు   
జాల జనము కిమ్మాను - యేలు నామ ఘనత కొరకు  
3. బలములేని వారమయ్యును - బలమొందవచ్చు - 
గలిమి మీఱ గర్త    
వాక్కున - నలయకుండ నడగుచుండ - నలగకుండ మోదమొంది    
బలమొసంగు సర్వవిధుల - నెలవి మీరనర్చుచుండ  
4. ఇద్దరి త్రి నుండునప్పుడే - ఈశ్వరుని జనులు - 
వృద్ధి బొంద జూడ    
   వలయును - బుద్ధి నీతిశుద్ధులందు - వృద్ధినొంద శ్రద్ధజేయు - 
          శుద్దులైన వారిలొ - బ్ర - సిద్దులగుచు వెలుగవచ్చు                  
5. పాప పంక మంటినప్పుడు - ప్రభు క్రీస్తుయేసు - ప్రాపు జేరి మీరు
     వేడగా - నేపు మీఱదనదు కరుణ - బాపమంత గడిగివేసి    
          పాప రోగ చిహ్నాలన్ని - బాపివేసి శుద్ధిచేయు          

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC