Song 23

కృపలను తలంచుచు
_________________________________________________

   పల్లవి : కృపలను తలంచుచు
ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్
1. మిమ్మును ముట్టినవాడు - నా కంటి పాపను
 ముట్టునని సెలవిచ్చిన దేవుడు - కాచెను గతకాలం నన్ను 
2. రూపింపబడుచున్న - ఏ ఆయుధముండినను
             నాకు విరోధమై వర్ధిల్లదుయని - 
                  చెప్పిన మాట సత్యం - ప్రభువు                
3. కన్నీటి లోయలలో - నే కృంగిన వేళలో
             నింగిని చీల్చి వర్షము పంపి - 
                 నింపెను నా హృదయం - యేసు             
4. సర్వోన్నతుడైన - నా దేవునితో చేరి
సతతము తన కృప వెల్లడి చేయు - 
     స్తుతులతో నింపెను యిలలో      
5.  హల్లెలూయ ఆమేన్ - ఆ.... నాకెంతొ ఆనందమే
             సీయోన్ నివాసం - నాకెంతొ ఆనందం - 
            ఆనందమానందమే - ఆమేన్   

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC