Song 21
కలువరి సిలువ
_________________________________________________
పల్లవి : కలువరి సిలువ సిలువలో విలువ నాకు
తెలిసెనుగా
కలుషము బాపి కరుణను చూపి నన్ను
వెదికెనుగా (2)
అజేయుడా విజేయుడా - సజీవుడా సంపూర్ణుడా (2)
1. కష్టాలలోన నష్టాలలోన - నన్నాదుకొన్నావయ్యా
బాధలలో వ్యాధులలో - కన్నీరు తుడిచావయ్యా (2)
మధురమైన నీ ప్రేమ - మరువగలనా ఆ ప్రేమ (2)
అనుక్షణం నీ ఆలోచన - నిరంతరము నాకు నీవిచ్చిన
2. పాపానికైనా శాపానికైనా - రక్తాన్ని
కార్చావయ్యా
దోషానికైనా ద్వేషానికైనా - మరణించి లేచావయ్యా (2)
మధురమైన నీ ప్రేమ - మరువగలనా ఆ ప్రేమ (2)
అనుక్షణం నీ ఆలోచన - నిరంతరము నాకు నీవిచ్చిన
Comments
Post a Comment