Song 17

సద్భక్తులారా
_________________________________________________


పల్లవి :  ఓ సద్భక్తులారా - లోకరక్షకుండు
బెత్లెహేమందు - నేఁడు జన్మించెన్ 
రాజాధిరాజు - ప్రభువైన యేసు
         నమస్కరింప రండి(3) యుత్సాహముతో
1. సర్వేశ్వరుండు - నరరూప మెత్తి
 కన్యకుఁ బుట్టి నేడు వేంచేసెన్
      మానవ జన్మమెత్తిన - శ్రీ యేసూ
       నీకు నమస్కరించి (3) పూజింతుము  
   2. ఓ దూతలారా - ఉత్సహించి పాడి
  రక్షకుండైన యేసున్ స్తుతించుడి
       పరాత్పరుండా - నీకు స్తోత్ర మంచు
          నమస్కరింప రండి (3) యుత్సాహముతో  
        3. యేసూ! ధ్యానించి - నీ పవిత్ర జన్మ
మీ వేళ స్తోత్రము నర్పింతుము
    అనాది వాక్య - మాయె నరరూపు
          నమస్కరింప రండి (3) – యుత్సాహముతో   

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC