Song 14
ఏ పాపమెరుగని యో
_________________________________________________
పల్లవి : ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా
నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా
1. ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ –
సిల్లిపోతివ రక్షకా
సిల్లిపోతివ రక్షకా
2. కలువరి గిరి దనుక – సిలువ మోయలేక –
కలవరము నొందినావా
కలవరము నొందినావా
సిలువ నీతో మోయ – తులువలు వేరొకని –
తోడుగా నిచ్చినారా
తోడుగా నిచ్చినారా
3. చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు –
సుడివడి నడచినావా
సుడివడి నడచినావా
కడకు కల్వరి గిరి – కడ కేగి సిల్వను –
గ్రక్కున దించినావా
గ్రక్కున దించినావా
4. ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై
నుంచిరా
నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది –
మేకులతో గ్రుచ్చినారా
మేకులతో గ్రుచ్చినారా
5. పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి –
నెలుగెత్తి మొరలిడితివా
నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ –
వలన దాహము నాయెనా
వలన దాహము నాయెనా
6. బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క –
జిల్లి బడ బొడచినాడా
జిల్లి బడ బొడచినాడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము
7. కట కటా పాప సం – కటము బాపుట కింత –
పటు బాధ నొందినావా
పటు బాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ – యెటువంటిదీ శాంత –
మెటుల వర్ణింతు స్వామి
మెటుల వర్ణింతు స్వామి
Comments
Post a Comment