Song 12
ఎందుకో నన్నింతగా
_________________________________________________
పల్లవి : ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)
1. నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే -
నా స్థానములో నీవే (2)
నా స్థానములో నీవే (2)
2. నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకున్నావు
నీ కొరకై నీ కృపలో (2)
నీ కొరకై నీ కృపలో (2)
3. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు
నను దాచియున్నావు (2)
నను దాచియున్నావు (2)
4. నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సంతసము నీలో
నీ సంపద నాలో నా సంతసము నీలో
నీవు నేను ఏకమగు వరకు
నన్ను విడువనంటివే (2)
నన్ను విడువనంటివే (2)
5. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ (2)
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ (2)
Comments
Post a Comment