Song 103 - Ravayya yesunaadha రావయ్య యేసునాధా

పల్లవి : రావయ్య యేసునాధా - మా - రక్షణమార్గము - నీ - సేవజేయ

మమ్ము - జేపట్టుటకు

1. హద్దులేక మేము - ఇల - మొద్దులమై యుంటిమి

మా కొద్ది బుద్ధులన్ని - దిద్ది రక్షింపను ॥రా॥

2.నిండు వేడుకతోను - మమ్ము - బెండువడక చేసి

మా -గండంబులన్నియు – ఖండించుటకు ॥రా॥

3.మేర లేని పాపము - మాకు భారమైన మోపూ

నీవు దూరంబుగా జేసి దారి జూపుటకు ॥రా॥

4.పాపుల మయ్యమేము - పరమ - తండ్రిని గానకను

మా పాపంబు లన్నియు – పారదోలుటకు ॥రా॥

5.అందమైన నీదు - పరమానంద పురమందు

మే మందరము జేరి యానందించుటకు ॥రా॥ 

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC