Song 102 - Rajulaku rajaina రాజులకు రాజైన యీ

పల్లవి : రాజులకు రాజైన యీ - మన విభుని పూజసేయుటకు రండి యీ

జయశాలి కన్న - మన కింక - రాజెవ్వరును లేరని

1.కరుణ గల సోదరుండై యీయన - ధరణి కేతెంచె నయ్యా తిర

ముగా నమ్ముకొనిన - మన కొసగు - బరలోక రాజ్యమ్మును ॥ రా॥

2. నక్కలకు బొరియలుండె - నాకాశ పక్షులకు గూళ్ళుండెను

ఒక్కింత స్థలమైనను - మన విభుని - కెక్కడా లేకుండెను

3.అపహాసములు సేయుచు - నాయన - యాననము పైనుమియుచు

గృప మాలిన సైనికులందరును - నెపము లెంచుచు గొట్టిరి ॥ రా॥

4.కరమునం దొక్క రెల్లు - పుడకను - దిరముగా నునిచి వారల్

ధరణీపతి శ్రేష్ఠుడా - నీ కిపుడు - దండ మనుచును మ్రొక్కిరి ॥ రా॥

5. ఇట్టి శ్రమలను బొందిన - రక్షకుని బట్టుదలతో నమ్మిన అట్టహాసము

తోడను బరలోక - పట్టణంబున జేర్చును ||రా||

6.శక్తి గల రక్షకుండై - మన కొరకు - ముక్తి సిద్ధము జేసెను భక్తితో

బ్రార్థించిన - మన కొసగు - రక్తితో నా ముక్తిని ॥రా॥

7. త్వరపడి రండి - యీ పరమ - గురుని యొద్దకు మీరు

దరికి జేరిన వారిని - యీ ప్రభువు - దరుమడెన్నడు దూరము ॥ రా ॥ 

Comments

Popular posts from this blog

"WHAT IS BIBLICAL CHRISTIAN FAITH ??" explained by Our dear Brother, Professor and Pastor Kumar M Pushparaj Sir. Founder of Bible Gospel Church, Hyderabad, Kattavarigudem...

"స్వభావికముగా మానవుని హృదయము ఎలాంటిది ??" Part-1 in Telugu and English by Pastor & Prof. Kumar.M.Pushparaj || BGC