Song 101 - Randi suvaratha sunadamutho రండి సువార్త సునాదముతో
పల్లవి : రండి సువార్త సునాదముతో -
రంజిలు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి
1.యేసే మానవజాతి వికాసం - యేసే
మానవ నీతి విలాసం
యేసే పతిత పావన నామం - భాసుర క్రైస్తవ శుభనామం ॥రం॥
2.యేసే దేవుని ప్రేమ స్వరూపం -
యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం - ఆశ్రిత జనముల సుఖవాసం ॥రం॥
3.యేసే సిలువను మోసిన దైవం -
యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ అధికారం - దాసుల ప్రార్ధన సహకారం ॥రం॥
4.యేసే సంఘములో మన కాంతి -
యేసే హృదయములో ఘన శాంతి
యేసే కుటుంబ జీవన జ్యోతి -
పసిపాపల దీవెన మూర్తి ॥రం॥
5.యేసే జీవన ముక్తికి మార్గం - యేసే భక్తుల భూతల
స్వర్గం
యేసే ప్రపంచ శాంతికి సూత్రం - వాసిగ నమ్మిన జనస్తోత్రం ॥రం॥
Comments
Post a Comment