Song 1
అత్యున్నత సింహాసనముపై
______________________________________
పల్లవి : అత్యున్నత
సింహాసనముపై – ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే (2)
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (3)
ఆ.హా.హా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్
1. ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచనకర్త స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి -సమాధాన అధిపతి స్తోత్రం (2)
2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావు - నా రక్షణకర్త స్తోత్రం (2)
3. ఆమెన్ అనువాడా స్తోత్రం - అల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం (2)
Comments
Post a Comment